Monday, December 23, 2024

పాతబస్తీలో ఎటిఎంల నుండి నోట్ల వర్షం.. రూ. 500 కొడితే రూ. 2500..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పాతబస్తీలో ఎటిఎంల నుండి నోట్లు భారీగా వస్తున్నాయి. రూ. 500 డ్రా చేసుకునేందుకు కొడితే ఏకంగా రూ. 2500 వచ్చాయి. ఈ విషయం తెలియడంతో ఎటిఎంల దగ్గర భారీగా క్యూ లైన్ కనిపించింది. పాతబస్తీలోని హరిబౌలి చౌరస్తా హెచ్‌డిఎఫ్‌సి ఎటిఎంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలిసిన పలువురు వినియోగదారులు ఈ ఏటియం వద్ద భారీగా లైన్ కట్టి మరీ డ్రా చేసుకుని వెళ్లారు. భారీగా జనం తరలిరావడంతో అటుగా వస్తున్న వారు ఆరా తీసి మరీ క్యూ లైన్‌లలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News