Wednesday, January 8, 2025

నథింగ్ ఫోన్ 2 అమ్మకాలు ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

గత వారం, లండన్‌కు చెందిన కన్స్యూమర్ టెక్ బ్రాండ్ నథింగ్, ప్రపంచానికి తమ ఫోన్ (2)ని పరిచటం చేసింది. నథింగ్ డ్రాప్స్‌కి విచ్చేసిన కమ్యూనిటీ, మీడియా, హాజరైన అతిథుల నుండి అపూర్వ స్పందన అందుకుంది. ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా శుక్రవారం, 21 జూలై మధ్యాహ్నం 12 గంటల నుండి భారతదేశంలో ఓపెన్ సేల్స్ ప్రారంభమవుతాయని సంస్థ గుర్తు చేస్తుంది.

నథింగ్ OS కోసం నథింగ్ ఐకాన్ ప్యాక్‌తో వినియోగదారులు ఇప్పుడు తమ ఫోన్ (2) రూపాన్ని పూర్తి చేయవచ్చు. కనీస మోనోక్రోమ్ లుక్ ను ఫోన్‌తో వున్నప్పుడు ఇతర అంశాలపై తక్కువ దృష్టి సారించటం తో పాటుగా మరింత ఉద్దేశపూర్వకంగా ఉండేలా చేయడానికి రూపొందించబడింది. ఇప్పుడు Google Play Storeలో అందుబాటులో అందుబాటులో ఉంది: https://t.co/lCB6MCETj4. ఫోన్ (1) వినియోగదారులు ఆగస్టు చివరిలో వచ్చే నథింగ్ OS 2.0, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఐకాన్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది.

నథింగ్ యొక్క ప్రీమియం ఆఫర్ మాత్రమే కాకుండా, పర్యావరణ పరంగా వారి అత్యంత అనుకూలమైన ఫోన్… ఫోన్ (2). నథింగ్ యొక్క ఫోన్ (2) సస్టైనబిలిటీ రిపోర్ట్ ప్రచురించబడింది. nothing.tech/pages/sustainability ద్వారా పూర్తిగా చదవవచ్చు.

లభ్యత, ధర

v ఫోన్ (2) తెలుపు, ముదురు బూడిద రంగులో అందుబాటులో ఉంది, వీటిని ఎంచుకోవడానికి క్రింది రకాలలో లభ్యమవుతుంది. 8GB/128GB ముదురు బూడిద రంగులో (రూ.44,999), 12GB/256GB (రూ.49,999), 12GB/512GB (రూ.54,999) రెండు రంగులలో.

v ప్రత్యేక ఆఫర్‌లు: ప్రీ-ఆర్డర్ పాస్ కొనుగోలుదారుల కోసం పరిమిత వ్యవధి ఆఫర్‌లో ఇవి ఉన్నాయి. తక్షణ తగ్గింపు రూ. 3000 Axis మరియు HDFC డెబిట్, క్రెడిట్ కార్డ్‌పై, ఫోన్ (2) కేస్ రూ.499, స్క్రీన్ ప్రొటెక్టర్ రూ.399, పవర్ (45W) అడాప్టర్ రూ.1,499, ఇయర్ (స్టిక్) రూ.4,250కు పొందవచ్చు. షరతులు వర్తిస్తాయి. స్టాక్‌లు ఉన్నంత వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News