Wednesday, December 25, 2024

ఫోన్(2)ను విడుదల చేసిన నథింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో తరం స్మార్ట్‌ఫోన్ ఫోన్(2)’ను విడుదల చేసినట్లు నథింగ్ వెల్లడించింది. ఫోన్(2) వెనుక భాగంలో కొత్త గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను పరిచయం చేశా రు. ఫీచర్లలో స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్1 ప్రాసెసర్ కల్గిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.45 వేలుగా నిర్ణయించారు.

ఫోన్ (2) తో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ డిజైన్ ఆవిష్కరణలతో మరింత ఉద్దేశపూర్వక స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ అత్యున్నత శ్రేణి ఫీచర్లను అందజేస్తామని న థింగ్ సిఇఒ, సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ అన్నారు. ఫోన్ (2) జూలై 21 నుండి ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లె ట్లలో అందుబాటులో వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News