Monday, December 23, 2024

కాంగ్రెస్‌తో ఒరిగేదేమి లేదు..!

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి/జహీరాబాద్: కర్ణాటకలో మూడు రోజులకోసారి తాగునీరు ఇస్తారు..ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీ లేదు..అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం అని ఆయనన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గురువారం ఆయన పర్యటించారు. కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల పనులను ప రిశీలించారు. నాణ్యతగా పనులు జరగాలని సూచిం చారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడ వద్దన్నారు.ఆగస్టు 15 లోగా నిర్మాణ పనులను పూర్తి చే యాలని సూచించారు. లబ్దిదారులకు అందించాలని పేర్కొన్నారు.అరెకటిక సంఘం నూతన భవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు పద్మశాలి భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఎన్నికల సమయంలో కనిపిస్తుందన్నారు. ఆ పార్టీ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. తెలంగాణాలో 24 గంటల కరెంట్ ను ఇస్తున్నామని, దేశానికే ఆదర్శంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 600 రూపాయల పించన్‌ను ఇస్తున్నారని, తెలంగాణాలో మాత్రం 2000 రూపాయల పించన్‌ను ఇస్తున్నామని పేర్కొన్నారు. దీన్ని బట్టే కాంగ్రెస్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న సంగతి అర్థమవుతుందన్నారు. తెలంగాణా ప్రభుత్వం ప్రజల మీద ప్రేమతో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.

గతంలో జహీరాబాద్‌లో ట్యాంకర్లతో తాగు నీరు ఇచ్చే వారని, కానీ నేడు సిఎం కెసిఆర్ ఆలోచనతో ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని, జహీరాబాద్‌లో 50 పడకల ఎంసిహెచ్ నిర్మాణం చేస్తున్నామని వివరించారు.14 వ తేదీ నుంచి గర్భిణులకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్‌ను పంపిణీ చేస్తామని చెప్పారు.6 లక్షల మందికి ఏడాదికి రెండు సార్లు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్‌లను ఇస్తామని తెలిపారు. జహీరాబాద్‌లో త్వరలో 700 డబుల్ బెడ్‌రూం ఇండ్లుపూర్తి చేసి,లబ్ధ్దిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు.

సాంత జాగా ఉన్న వారికి ఇండ్ల నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని మంత్రి వివరించారు. జహీరాబాద్‌లో జంగమ సమాజ నిర్మాణం కోసం 10 గుంటల స్థలం కేటాయిస్తూ భూమి పత్రాలు మంత్రి అందించారు.భవన నిర్మాణానికి కూడా తమ వంతు సాయం ఉంటుందన్నారు. కెసిఆర్ పాలనకు మీ ఆశీస్సులుండాలని ఆయనకోరారు. జంగమ సంఘానికి స్థలం కేటాయించడం సంతోషంగా హరీష్‌రావు పేర్కొన్నారు. ఎంపి బిబి పాటిల్, కలెక్టర్ శరత్, ఎంఎల్‌ఎ మాణిక్‌రావు, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ ఛైర్మన్ చింత ప్రభాకర్,డిసిఎంఎస్ ఛైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News