Friday, December 20, 2024

అదానీ విషయంలో భయపడ్డానికి, దాచడానికి ఏమిలేదు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్‌అదానీ వివాదంలో ప్రతిపక్షాలు బిజెపి ప్రభుత్వాన్ని లక్షం చేసుకున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడంపై చెప్పడానికి ఏమిలేదని, బిజెపి ఏది దాచిపెట్డడం కానీ, భయపడ్డం కానీ చేయడంలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హిండెన్‌బర్గ్‌అదానీ వివాదం ఇప్పుడు రాజకీయ వివాదంగా తయారయింది. కేంద్ర ప్రభుత్వం ఫెవరిటిజం, క్రోనిక్యాపిటలిజంకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. బడ్జెట్ సమావేశంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు, దర్యాప్తుకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీపై ధ్వజమెత్తాయి. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్‌ఐసి, ఎస్‌బిఐ తదితర ప్రభుత్వరంగ బ్యాంకులు పెట్టిన పెట్టుబడిపై వారు ప్రశ్నలు లేవనెత్తారు.

ఇదిలావుండగా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత మదుపరుల ప్రయోజనాలు కాపాడేందుకు సెబీ కమిటీని ఏర్పాటుచేయడానికి ఒప్పుకుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సొలిసిటర్ తుషార్ మెహతా ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్‌కు తెలిపారు. ప్రభుత్వ సంస్థలను బిజెపి హస్తగతంచేసుకుంటోంది అన్న కాంగ్రెస్, ప్రతిపక్షాల ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ ‘వారు కోర్టుకు వెళ్లవచ్చు, కోర్టులేమి బిజెపి ప్రభావంలో లేవు’ అన్నారు. ‘కోర్ట్ హమారే కబ్జేమే నహీ హై’ అన్నారు. ‘ఎన్ని కుట్రలు జరిగినా ప్రధాని నరేంద్ర మోడీ మరింత బలోపేతం అయ్యారు. మోడీకి వ్యతిరేకంగా కుట్రలు 2002 నుంచే మొదలయ్యాయన్నారు. వేలాది కుట్రలైనా సరే సత్యాన్ని దెబ్బతీయలేవు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News