ఉద్యోగులనూ తీవ్ర నిరాశ పరిచిన బడ్జెట్
తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశను కలిగించిందని తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టిఎస్‌పిఈఏ ) అభివర్ణించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రత్యక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఉపాధి కల్పనదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని టిఎస్‌పిఈఏ ప్రెసిడెంట్ పి.రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ పి. సదానందం శుక్రవారం నాడిక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 80 సీ పరిమితి, స్టాండర్డ్ డిడక్షన్‌లో ఎలాంటి మార్పు లేదని వారు తెలిపారు. ఆశించిన స్థాయిలో పెరుగుదల లేదని, పాత పింఛను పునరుద్ధరణపై కేంద్ర ఆర్థిక మంత్రి నోరు మెదపకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు. అన్నింటికీ మించి కార్మికవర్గ ప్రయోజనాలను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.