Monday, December 23, 2024

అక్రమంగా దర్గా నిర్మాణం.. నోటీసులు ఇచ్చిన పోలీస్ స్టేషన్ పై దాడి

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: అక్రమంగా దర్గాను నిర్మిస్తున్నారని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో పోలీస్ స్టేషన్‌పై ఒక గ్రూప్ దాడి చేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జునాగఢ్ ప్రాంతంలో ఒక గ్రూప్ ఎటువంటి అనుమతి తీసుకోకుండా అక్రమంగా దర్గాను నిర్మిస్తున్నారు. దీంతో పోలీసులు దర్గాను నిర్మించవద్దని నోటీసులు ఇచ్చారు.

Also Read: రోహిత్‌కు విశ్రాంతి… కెప్టెన్‌గా రహానే?

దీంతో గ్రూప్ పోలీస్ స్టేషన్ చేరుకొని రాళ్లతో దాడులు చేసింది. పోలీస్ వాహనం వెళ్తుండగా దానిపై పెద్ద పెద్ద రాళ్లు వేయడంతో పాటు విసిరారు. ఈ ఘటనలో డిఎస్‌పి కూడా తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ బలగాలు అక్కడికి చేరుకొని టియర్ గ్యాస్‌ను ప్రయోగించి అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులకు, ఓ గ్రూప్ మధ్య జరిగిన గొడవల్లో ఒక వ్యక్తి మృతి చెందాడు. దాడికి పాల్పడిన 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News