Tuesday, March 4, 2025

మహారాష్ట్ర సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ మంగళవారం వెల్లడించింది. మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే రాజీనామను ముఖ్యమంత్రి ఆమోదించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మంత్రి రాజీనామా వ్యవహారాన్ని సభ ముందుకు తీసుకురావలసి ఉండగా, సీఎం అందుకు భిన్నంగా వ్యవహరించారని, ఆరోపించింది. రాజీనామాపై సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని, అలా కాకుండా మీడియా ముందు మంత్రి రాజీనామాపై ప్రకటన చేయడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. బీడ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో ధనంజయ్ ముండే సన్నిహితుడు వాల్మీక్‌కరద్ పేరు చేర్చడంతో మంత్రి మంగళవారం తన రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామా వెంటనే సీఎం ఆమోదించారు. ఈ విషయాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News