Monday, January 20, 2025

కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వని 81 రైస్‌మిల్లర్లకు నోటీసులు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: 2022-23 ఖరీఫ్ ధాన్యం దిగుమతి చేసుకొని కస్టమ్ మిల్లింగ్ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్‌మిల్లర్లతో జాయింట్ కలెక్టర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ ధాన్యం దిగుమతి, సీఎంఆర్ చెల్లింపులపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీప్ 2022-23 ధాన్యం దిగుమతి చేసుకొని కస్టమ్ మిల్లింగ్ ఇవ్వాలని రైస్‌మిల్లర్లను ఆదేశించారు. ఇప్పటివరకు కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వని 81 రైస్‌మిల్లులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించాలని, వారం లోపల ఎలాంటి ప్రగతి కనిపించని మిల్లులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, జిల్లా పౌరసరఫరాల అధికారులు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, మిల్లర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News