మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు అందించారు. గత వారం రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమా వేశంలో బాల్క సుమన్ సిఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు 294బి, 504, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం అక్రమంగా తన మీద కేసు నమోదు చేసిందని బాల్క సుమన్ ఆరోపించారు.
ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ తమదని, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తానని ఆయన వెల్లడించారు. బాల్క సుమన్ ఎక్స్ ద్వారా స్పందించారు. “సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్‌స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో భాగంగా ఆదివారం మంచిర్యాల ఎస్‌ఐ కేసులకు సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది. ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ మాది, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం” అని బాల్క సుమన్ పోస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసారు.
ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన నోటీసులు అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది pic.twitter.com/iSk4Xiz52P
— Balka Suman (@balkasumantrs) February 11, 2024