Tuesday, December 17, 2024

‘6గురు’ ప్రముఖులకు నోటీసులు?

- Advertisement -
- Advertisement -

Notices to celebrities in Chikoti case?

మన తెలంగాణ/హైదరాబాద్ : చీకోటి హారంలో ఆరుగురు రాజకీయ ప్రముఖులకు ఇడి నోటీసులు పంపినట్లు తెలిసింది. వీరంతా శనివారమే విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. నాలుగు రోజుల పాటు చీకోటి పాటు మరో ముగ్గురు అతని అనుచరుల్ని వ్యాపార వ్యవహారాలు నడిపే వారిని ఇడి అధికారులు ప్రశ్నించారు. వారి నుంచి రాబట్టిన సమాచారం, వారి వాట్సాప్ చాట్‌లలో లభించిన ఆధారాల ఆధారంగా ఆరుగురు ప్రముఖులకు ఇడి నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. వారిలో నలుగురు ఎంఎల్‌ఎలు, ఇద్దరు మాజీ ఎంఎల్‌ఎలు ఉన్నట్లు సమాచారం. అంతకుముందు చీకో టి ప్రవీణ్‌ను ఇడి నాలుగో రోజు (శుక్రవారం) విచారించింది. ఈక్రమంలో గడచిన ఏడు నెలల కాలంలో క్యాసి నో ఏజెంట్లు చీకోటి, మాధవరెడ్డిలు ఇప్పటి వరకు ఎన్ని టూర్‌లు నిర్వహించారు..? పంటర్లను తరలించినందుకు విమానాలకు వెచ్చించిన మొత్తాలపై ఆరా తీశారు. అంతేకాకుండా చీకోటి ప్రవీణ్ ఫోన్ డేటాలో ఉన్న కస్టమర్లు ఎవరెవరు ఎంత మొత్తాలు చెల్లించారు, విదేశాల్లోకి నగ దు లావాదేవీలను హవాలా మార్గంలో ఎలా జరిపారన్న విషయాలపై నిందితులను వేర్వేరు గదులలో ఉంచి ప్ర శ్నించారు.

నిందితుల సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లలో ఉన్న తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులతో ఉన్న సన్నిహిత సంబంధాలపైనా ఇడి అధికారులు విచారించారు. క్యాసినో వేగస్ బై, బిగ్‌డాడి పేరిట పెద్దఎత్తున జరిగిన గ్యాంబ్లింగ్‌లో లావాదేవీలపై ఆరా తీశారు. క్యాసినో వ్యవహారంలో మాధవరెడ్డి, ప్రత్యేక విమానాలు సమకూర్చిన ఆరాధ్య టావెల్స్ అధినేత సంపత్‌లను ఒకచోటకు చేర్చి ఇడి ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. ఇడి అధికారుల విచారణ ముగిసిన అనంతరం చీకోటి మీడియాతో మాట్లాడుతూ విచారణలో ఇడి అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని, తాను లీగల్‌గా క్యాసినో నిర్వహించా అందు లో తప్పేముందని తేల్చిచెప్పాడు. తనకు ప్రాణహాని ఉంద ని అందుకే రక్షణ కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దా ఖలు చేశానని చెప్పారు. కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మా ధ్యమాల్లో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి తప్పుడు పో స్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనికి సంబంధించి సిసిఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు చీకోటి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News