Monday, December 23, 2024

సిఇసి, ఇసిల నియామక చట్టంపై కేంద్రానికి నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్( సిఇసి), ఎన్నికల కమిషనర్ల నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన చట్టంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే ఈ చట్టాన్ని కొట్టి వేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్ల ను విచారించడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్ అంగీకరించింది. ఇందులో భాగంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఏప్రిల్ లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. పాతచట్ట ప్రకారం సిఇసి, ఎన్నికల కమిషనర్లను కేంద్రప్రభుత్వం సి ఫార్సుల మేరకు రాష్ట్రపతి నియమించే వారు. అయితే కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన చట్ట ప్రకా రం ఇకనుంచి ఈ బాధ్యతలను సెర్చ్, ఎంపిక కమిటీలు నిర్వహిస్తాయి. అయితే కొత్త చట్టం ఎన్నికల కమిషన్‌ను కేంద్రప్రభుత్వం నియంత్రించే విధంగా ఉందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్టే విధించాలని కాంగ్రెస్ నేత జయా ఠాకూర్, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాది గోపాల్ సింగ్ సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వీటిపై కేంద్రప్రభుత్వం వాదనలు వినకుండా స్టే విధించలేమని పిటిషనర్లకు స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News