Thursday, January 23, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నలుగురు బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎలకు నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బిఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంఎల్‌ఎలు నలుగురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్‌కు చెందిన బిఆర్‌ఎస్ సీనియర్ నేతలు, మాజీ ఎంఎల్‌ఎలు కూడా నోటీసులు అందుకున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో లభించిన క్లూస్ ద్వారా వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి కెటిఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయోనని బిఆర్‌ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అమృత్ టెండర్లలో తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందని బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి కెటిఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ సర్కార్‌పై ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నింది తుడిగా పోలీసులు పేర్కొన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. అమెరికా టూర్‌లో ఉన్నానని, ఇండి యాకు తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, నెలలు గడిచినా ఆయన తిరిగి రాకపోవడంతో ప్రభాకర్ రావును భారత్ కు రప్పించడంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే ప్రభాకర్ రావుకు తాజాగా అమెరికా గ్రీన్ కార్డ్ వచ్చిందని, ఇప్పట్లో ఆయన భారత్ కు వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా అప్పటి ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును సీజ్ చేసే విషయంలో ఇప్పుడు అరెస్టు అయిన పోలీసుల పాత్ర ఉంది.

వీటితోపాటు అప్పటి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు పోలీస్ వాహనాల్లో డబ్బులు సైతం వెళ్ళినట్లు చార్జిషీట్లోనూ దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పుడు నోటీసులు అందుకున్న మాజీ ఎమ్మెల్యేలే పోలీసుల సహాయంతో డబ్బుల సంచులను ఎన్నికలకు తరలించినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో వీరి స్టేట్‌మెంట్ రికార్డ్ తోపాటు వీరి పాత్ర పైనా పోలీసులు విచారించాల్సిన ఉంది. అందులో భాగంగానే వీరికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. కాగా, సోమవారం నకిరేకల్ మాజీ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. నవంబర్ 14వ తేదీన చిరుముర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరు కానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News