Monday, December 23, 2024

కాళేశ్వరం ఈఎన్‌సికి నోటీసులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం ఈఎన్‌సికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజిని నిర్మించిన కాంట్రాక్టు కంపెనీ ఎల్‌అండ్‌టికి పరస్పర విరుద్ధ ధృవీకరణలు ఎందుకు ఇచ్చారో తెలపాలని నోటీసుల్లో వివరణ కోరింది. బ్యారేజి నిర్మాణంలో లోపాలకు, పని పూర్తి కాకుండానే పూర్తయినట్టు నివేదిక ఇచ్చి,  తమను తప్పుదోవ పట్టించడానికి బాధ్యులు ఎవరో తేల్చి వివరాలు పంపాలని ఆదేశిస్తూ ఈ మేరకు ఈఎన్‌సి (జనరల్) మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సికి నోటీసులు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News