విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో బిఆర్‌ఎస్ అధినేతకు జారీ చేశామని జస్టిస్
ఎల్. నరసింహారెడ్డి ప్రకటన కెసిఆర్‌తోపాటు మరో 25మందికి నోటీసులు జారీ
నోటీసులు అందుకున్న వారిలో అరవింద్‌కుమార్, ఎస్‌కె జోషి, అజయ్‌మిశ్రా
తదితరులు వివరణ ఇచ్చేందుకు జులై 30వరకు గడువు కోరిన కెసిఆర్ నిరాకరించిన
న్యాయమూర్తి జూన్ 15లోగా సమర్పించాలని ఆదేశం విద్యుత్ కొనుగోళ్లకు
బహిరంగ టెండర్ పిలువకపోవడంపై జస్టిస్ ప్రశ్నల వర్షం
మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వలో జరిగిన విద్యుత్ ప్రాజెక్టుల ని ర్మాణం విద్యుత్ కొనుగోళ్లు తదితర అంశాలకు సంబంధించి నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభు త్వ విజ్ణప్తి మేరకు ఏర్పాటైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వివారణలో వేగం పెంచింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసు లు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపా రు. ఇదే వ్యవహారంలో మరో 25మందికి నోటిసులు ఇచ్చినట్టు వెల్లడించారు.యాదాద్రి, భద్రా ద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పంద విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ వి చారణను మరింత లోతుగా కొనసాగిస్తోంది. ఈ అంశంలో కేసీఆర్, మాజీ ఇంధన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన అ ర్వింద్ కుమార్, ఎస్‌కే జోషి, సురేశ్ చందా, అ జయ్ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు.
ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జులై 30వ తేదీ వరకు సమయం కోరగా జూన్ 15వరకు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకుంటే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారం విద్యుత్ రాష్ట్రవిద్యుత్ రంగ సంస్థల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. యాదా్రద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన పనులకు అప్పటి ప్రభుత్వం బిహెచ్‌ఈఎల్ సంస్థకు అప్పగించింది. ఈ అంశంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంత పెద్ద ప్రాజెక్టును కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు పిలిచి ఉంటే తక్కవ ధరకే కోట్ చేసిన నిర్మాణ సంస్థల వల్ల ప్రభుత్వానికి ఆర్దిక భారం తగ్గివుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం ఎందుకు టెండర్లు పిలవలేదని అప్పటి అధికారులను ప్రశ్నించింది.
అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అవసరాలకు బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సివస్తే జాతీయంగా బహిరంగ టెండర్ ఎందుకు పిలువలేదని కమిషన్ ప్రశ్నించింది. కాంపెటేటివ్ బిడ్డింగ్‌ను నిర్వహించి ఉంటే బయటి సంస్థలు పోటీ పడి విద్యుత్‌ను తక్కువ ధరకే సరఫరా చేసి ఉండేవి కదా అని ప్రశ్నించింది. టెండర్ నిబంధనలు పాటించకుండా చత్తిస్ గడ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదర్చుకోవటం వల్ల ప్రభుత్వంపై అధికభారం పడింది కదా అని వెల్లడించింది. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ఎందుకు నిబంధనలు పాటించలేదని అప్పటి సంబంధిత ముఖ్య అధికారులను ప్రశ్నించింది. విచారణలో కీలక స్థానల్లో ఉన్న అప్పటి అధికారులు తాము ప్రభుత్వ నిర్ణాయాలు సూచనల మేరకే నడుచుకున్నట్టు కమీషన్ ముందు వెల్లడించారు. విచారణలో కొన్ని కీలక అంశాలపై కమీషన్ మీడియాకు ముక్తసరిగా వెల్లడించింది.
కెసిఆర్‌కు 15వరకే గడువు
‘ఒకటి ఛత్తీస్‌గఢ్ నుంచి పవర్ కొనుగోలు ఒప్పందం, రెండోది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడోది యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం. ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా డైరెక్ట్‌గా అనుమతులు ఇచ్చినవే. ఈ ప్రక్రియలో దాదాపు 25 మంది ఉన్నట్లు గుర్తించాం. ఇందులో నిర్ణయాలు తీసుకున్న అధికారులు, అనధికారులు అందరికీ నోటీసులు జారీ చేశాం. అలానే వారు సమాధా నం ఇచ్చారు. వారిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే జులై చివరి వరకు సమ యం అడగ్గా, మేం అందుకు జూన్ 15 వరకు టైం ఇచ్చాం.
-జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి