Wednesday, January 22, 2025

తెలంగాణ సహా 12 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికల ప్రకటన జారీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సిఈసి ప్రకటన జారీ చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానికి కూడా ఎన్నికలు జరుగనున్నాయి.

సెప్టెంబర్ 3వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్, అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి లెక్కింపు.  ఇక నామినేషన్ల ఉపసంహరణ ఆగస్టు 26,27న ఉండనున్నాయి. కెకె కాంగ్రెస్ పార్టీలో చేరినందున ఆయన ఖాళీ చేసిన సీటు కూడా కాంగ్రెస్ కే వచ్చేలా ఉంది. కాగా 12 రాజ్యసభ స్థానాల్లో 11 స్థానాలు ఎన్డీయే కూటమే దక్కించుకోనుందని తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News