Sunday, December 22, 2024

మహిళా, శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Notification for 181 Jobs in Women and Child Welfare Department

సెప్టెంబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ -1, ఎస్‌ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా, తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలో 181 . గ్రేడ్ -1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(సూపర్ వైజర్) పోస్టుల భర్తీ టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు హోమ్ సైన్స్ లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో డిగ్రీ లేదా బిఎస్‌సి హానర్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషియన్ లేదా బయోకెమిస్ట్రీ, బిఎస్‌సి అప్లైడ్ న్యూట్రిషియన్, బోటనీ/జువాలజీ అండ్ కెమిస్ట్రీ తదితర కోర్సులు చదివిన మహిళా అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్‌సి,ఎస్‌టిలకు ఐదేళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు, ఎన్‌సిసి, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీకి 3 ఏళ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసును బట్టి 5 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. అర్హులైన మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 8 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్ చూడాలని కమిషన్ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News