Tuesday, December 24, 2024

క్రీడా పాఠశాలల్లో 4, 5 తరగతుల ఆడ్మిషన్ల పరీక్షకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారి సంస్ద ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర క్రీడల పాఠశాల, కరీంనగర్, ఆదిలాబాద్‌లలోని క్రీడా పాఠశాలలోని 4వ, 5వ తరగతులకు ఆడ్మిషన్లు కోసం ప్రవేశ పరీక్షలు జరిపేందుకు నోటిఫికేషన్ జారీ ప్రకటనను విడుదల చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలో గత విద్యా సంవత్సరం కోవిడ్ కారణంగా 202122 విద్యా సంవత్సరంలో 4వ తరగతి ఆడ్మిషన్లు నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. ఈవిద్యా సంవత్సరంను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న క్రీడా పాఠశాలలు హాకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో 4వ, 5వ తరగతులలో 15 క్రీడా విభాగాల్లో మొత్తం 240 సీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. హాకీంపేటలోని 4వ తరగతిలో బాలురకు ఉన్న 20సీట్లు, బాలికలకు ఉన్న 20 సీట్లు, 5వ తరగతిలో బాలురకు ఉన్న 20 సీట్లు, బాలికలకు ఉన్న 20 సీట్లు మొత్తం 80 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్‌లలోని క్రీడా పాఠశాలలలో 4వ తరగతిలో బాలురకు ఉన్న 20 సీట్లు, బాలికలకు ఉన్న 20 సీట్లు, 5వ తరగతిలో బాలురకు ఉన్న 20సీట్లు, బాలికలకు ఉన్న 20సీట్లు మొత్తం 80 సీట్లనుభర్తీ చేసేందుకు ఆడ్మిషన్లు కొసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ప్రకటన విడదల చేసినట్లు చెప్పారు. ఆర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News