Wednesday, January 22, 2025

235 మంది డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లను కాంట్రాక్ట్ ప్రాతిపదిక నియమించుకునేందుకు నోటిఫికేషన్ విడులైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో వివిధ స్థాయిలలో 235 మంది వైద్యులను నియమించుకోనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నియామకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ నియామకాలు పారదర్శకంగా జరిగేలా హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌లు నోడల్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

రేపు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఇంటర్వూలు
ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 175 పోస్టులు భర్తీ చేయనుండగా, అందులో 8 ప్రొఫెసర్ పోస్టులు, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 111 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 33 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టులు ఉన్నాయి. అలాగే గాంధీ ఆసుపత్రిలో మొత్తం 60 పోస్టులు ఉండగా, 3 ప్రొఫెసర్ పోస్టులు, 29 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 29 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, 4 ట్యూటర్ పోస్టులు ఉన్నాయి. ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆస్పత్రులలో మొత్తం. 235 పోస్టులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాకింగ్ ఇన్ ఇంటర్వ్యూ విధానంలో నియమించే ఈ నియామకాలకు ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 గంటలకు గాంధీ మెడికల్ కాలేజి పరిపాలన భవనంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అదేవిధంగా అదేరోజు ఉదయం 10.30 గంటలకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అకడమిక్ బ్లాక్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ నెల 12న ధృవపత్రాల పరిశీలన నిర్వహించి, ఈ నెల 13న అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ నెల 14న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News