Wednesday, January 22, 2025

ఎపిలో ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Notification for Atmakuru by-election in AP

జూన్ 23న పోలింగ్, 26న ఫలితాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు బుధవారం నాడు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మేకపాటి గౌతంరెడ్డి మృతితో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఈ నెల 30న నోటిషికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్లు దాఖలుకు జూన్ 6 వరకు గడువు విధించింది. అలాగే జూన్7న నామినేషన్ల పరిశీలన, జూన్ 9 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈక్రమంలో జూన్ 23న పోలింగ్, 26న ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దేశంలో 3 పార్లమెంట్, 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించనున్నారు.

ఇటీవల మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన తనయుడు మేకపాటి విక్రమ్‌ర్రెడ్డిలు సిఎం జగన్‌ను కలిశారు. రాజమోహన్‌రెడ్డి పెద్ద కుమారుడైన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను గౌతమ్‌రెడ్డి భార్యకు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అయితే తన రెండో కొడుకు విక్రమ్‌రెడ్డికి ఇవ్వాలని రాజమోహన్‌రెడ్డి సిఎంను కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు ఆత్మకూరు ఉప ఎన్నికలలో టిడిపి నుంచి పోటీ చేస్తామని ప్రకటించలేదు. అయితే బిజెపి మాత్రం తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News