Monday, December 30, 2024

వైద్యారోగ్యశాఖలో 371పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

వైద్య ఆరోగ్యశాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 7300 పోస్టులను భర్తీ చేయగా, మరో 6500 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో 272 నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్) పోస్టులు, 99 ఫార్మసిస్ట్(గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి)నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెల 18వ తేదీన విడుదల చేసిన 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అదనంగా 272 పోస్టులు కలుపనున్నట్లు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం నర్సింగ్ ఖాళీల సంఖ్య 2,322కు పెరిగింది. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియనున్నది. నవంబర్ 17వ తేదీన ఆన్‌లైన్ పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహించనున్నారు.

732 ఫార్మసిస్ట్ పోస్టులు
633 ఫార్మసిస్ట్(గ్రేడ్ 2) పోస్టులకు గత నెల 24వ తేదీన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్‌కు అదనంగా మరో 99 పోస్టులను జత చేస్తున్నామని, మొత్తం పోస్టుల సంఖ్య 732కు పెరిగిందని తెలుపుతూ శుక్రవారం బోర్డు ప్రకటించింది. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియనున్నది. నవంబర్ 30వ తేదీన ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. జోన్లు, కేటగిరీల వారీగా ఖాళీల సంఖ్యను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.inలో అందుబాటులో ఉంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News