Thursday, January 23, 2025

హైకోర్టులో 65 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Notification for filling up 65 posts in High Court

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టులో 65 ఉద్యోగాల భర్తీకి బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేశారు. జడ్జిలు, రిజిస్ట్రార్ల పర్సనల్ సెక్రటరీలు, కోర్టు మాస్టర్ల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు 65 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు తెలిపింది. దేశంలోని ఏ యూనివర్సిటీ నుంచైనా డిగ్రీ, లా విద్యను అభ్యసించిన వారందరూ ఈ పోస్టులకు అర్హులే అని నోటిఫికేషన్‌లో తెలిపారు. దరఖాస్తుదారులకు 2022, జులై 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలని, అలాగే 34 ఏండ్ల వయసు మించరాదని నిబంధనలలో పేర్కొన్నారు. అయితే ఎస్‌సి,ఎస్‌టి,బిసి ఇడబ్ల్యూఎస్ కేటగిరికి చెందిన అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఇచ్చినట్లు తెలిపారు. ఓసి, బిసి కేటగిరిల వారు రూ. 800 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, ఎస్‌సి,ఎస్‌టి,ఇడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులు రూ. 400 చెల్లించాలన్నారు. డిడిలను ది రిజిస్ట్రార్(రిక్రూట్మెంట్), రాష్ట్ర హైకోర్టు పేరిట తీయాలని, దరఖాస్తులను స్పీడ్ పోస్టు, కొరియర్ ద్వారా జులై 22న సాయంత్రం 5 గంటల్లోపు హైకోర్టుకు పంపాలని నోటిఫికేషన్‌లో వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News