Sunday, December 22, 2024

10 సివిల్ జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్‌లో 10 సివిల్ జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 8 జడ్జి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుండగా, 2 బదిలీ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

ఈ మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్(రిక్రూట్‌మెంట్) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి మార్చి 1వ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 23వ తేదీన ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News