Sunday, January 19, 2025

హైదరాబాద్ మెట్రోలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోలో ఖాళీల భర్తీ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఎమ్‌ఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు మెట్రో వెల్లడించింది. మొత్తం 12 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏఎమ్‌ఎస్ ఆఫీసర్‌కు సంబంధించి..వ్యాపార విశ్లేషకుడిగా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మంచి అనుభవం కలిగి ఉండాలి. ఐబిఎం మ్యాక్సిమో సాప్ట్‌వేర్‌లో నైపుణ్యం ఉండాలి.అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
సిగ్నలింగ్ టీమ్‌కు సంబంధించి..
ఎస్‌ఐజి, సిఓఎం, ఏఎఫ్‌సి నిర్వహణలో డిప్లమా ఇంజనీర్‌గా కనీసం 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అయిండాలి.
రోలింగ్ స్టాక్ టీం లీడర్ పోస్టు కోసం..
ఇంజనీర్- మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమా లేదా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ మెయింటనెన్స్‌లో 4 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉండాలి.
సాంకేతికత ఆధారిత రైలు, మెట్రో, పారిశ్రామిక వాతావరణంలో పనిచేసే పరిజ్ఞానం ఉండాలి.
ట్రాక్స్ టీం లీడర్‌గా..
బిఈ, బిటెక్ పూర్తి చేసి నాలుగు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. లేదంటే ఇంజనీరింగ్ డిప్లమా చేసిన వారికి ట్రాక్ నిర్వహణలో 4 నుంచి 7 సంవత్సరాల అనుభవం ఉండాలి.
సివిల్ లేదా మెకానిక్‌లో డిప్లమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ఐటీ ఆఫీసర్‌గా..
బిటెక్, ఐటీ, ఎమ్‌సిఏ, ఐటీ, ఎమ్‌సిఏ-ఐటీ పూర్తి చేసి ఉండాలి.
బహుళజాతి, సర్వీసెస్ కన్సల్టింగ్ పరిశ్రమల్లో 1-2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం ఖాళీల వివరాలు ఇలా..
ఖాళీలు- 12
ఏఎమ్‌ఎస్ ఆఫీసర్ – 1
సిగ్నలింగ్ టీమ్ – 2
రోలింగ్ స్టాక్ టీం లీడర్ – 6
దరఖాస్తు చేసుకునే విధానం ఇలా…
నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హతలు కలిగిన వారు KeolisHyd.Jobs@keolishuderabad.com మెయిల్‌కు తమ బయోడేటాను పంపించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News