- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: పిజి వైద్య సీట్లను భర్తీ చేసేందుకు నేటి (13వ తేదీ) నుంచి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్శి టీ శనివారం ప్రకటించింది. దరఖాస్తు ప్ర క్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్శిటీ పరిధిలోని పిజి వైద్య కళాశాలల్లో క న్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 13 ఉద యం 8 గంటల నుంచి 15వ తేదీ 8 వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా న్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం యూనివర్శిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాలని ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -