25న ప్రీబిడ్ సమావేశం
జులై 13 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ
15న ఈ వేలం హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో కోకాపేట భూములు
టిఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో ఖానామెట్ భూముల వేలం ప్రక్రియ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ భూముల విక్రయానికి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నిధుల సమీకరణ నిమిత్తం ఈ వేలం ద్వారా ప్రభుత్వ భూములు అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియను సైతం అధికారులు ప్రారంభించారు. అమ్మకానికి ఇప్పటికే మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. తాజాగా భూముల విక్రయానికి ప్రకటన జారీ చేసింది. మొదటి దశలో హెచ్‌ఎండిఎకు చెందిన కోకాపేట భూములతో పాటు ఖానామెట్ భూ ములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోకాపేటలో హెచ్‌ఎండిఏ అభివృద్ధి చేసిన నియో పోలీస్ లే ఔట్‌లోని ఏడు ప్లాట్లతో పాటు గోల్డెన్‌మైల్ లే ఔట్‌లోని ఒక ప్లాట్ ఉంది. 49.92 ఎకరాల విస్తీర్ణంలోని కోకాపేటలోని ప్లాట్లు, ఖానామెట్‌లో టిఎస్‌ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. మొత్తం 64.93 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ నెల 15వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనుండగా, 25న ప్రీబిడ్ సమావేశం జరగనున్నట్టు అధికారులు తెలిపారు. జూలై 13 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ కాగా జూలై 15న ఈ -వేలం నిర్వహిస్తారు. కోకాపేట భూముల వేలం ప్రక్రియను హెచ్‌ఎండిఏ, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను టిఎస్‌ఐఐసీ నిర్వహించనుంది.
Notification for sale of TS Govt lands on 15th