Sunday, December 22, 2024

నేడు మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ రాష్ట్ర కోటాలో ఎంపికైన బడుగుల లింగయ్యయాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవి కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరణ, 16న నామినేషన్ల పరిశీలన, 20న ఉప సంహరణ ఉంటుంది. ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజూ సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం 65 మంది ఎమ్మెల్యేలు కాగా, రెండు ఎంపీ స్థానాలు, బిఆర్‌ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక స్థానం దక్కనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News