Monday, December 23, 2024

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో 1,601 ఉద్యోగాల భర్తీపై ప్రకటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వం నిరుద్యోగులకు మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్‌పిడిసిఎల్)లో 1,601 ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. డైరెక్ట్ ప్రాతిపదికన 1,553 జూనియర్
లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే, ఈ ఉద్యోగాలకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను ఈనెల 15వ తేదీ లేదా ఆ తర్వాత తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.

రాతపరీక్ష, నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.గతేడాది మే నెలలోనే 1,000 జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించినప్పటికీ కొందరు వ్యక్తులు ఈ పరీక్షలో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని నియామక ప్రక్రియను రద్దు చేశారు. తాజాగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలంటూ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆ సంస్థ చైర్మన్ రఘుమారెడ్డిని ఆదేశించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది.
జూనియర్ లైన్‌మెన్‌కు రూ.24 వేల నుంచి
జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు పదో తరగతితో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్‌మెన్) లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్‌మెన్ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్లు. వేతన శ్రేణి రూ. రూ.24,340- రూ.39405లుగా నిర్ణయించారు.
అసిస్టెంట్ ఇంజనీర్‌కు రూ.64 వేల నుంచి….
అదే అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలకైతే ఇంజనీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండొచ్చు. వేతన శ్రేణి రూ.
రూ.64,295 – రూ.99,345లుగా నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News