Sunday, January 19, 2025

1326 వైద్య పోస్టులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదల
జులై 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వైద్యులకు 20 శాతం వెయిటేజీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1,326 డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్ పోస్టులు, తెలంగాణ వైద్య విద్యవిధాన పరిషత్‌లో 211 సివిల్ అసిస్టెంట్ సర్జన్ – జనరల్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపిఎం)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఎంబిబిఎస్ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండి, తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వైద్యులు జులై 15 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాల కోసం https://mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడాలి.

కాంట్రాక్ట్ వైద్యులకు 20 శాతం వెయిటేజీ

రాష్ట్రంలో డాక్టర్ పోస్టుల నియామకాలలో ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలందించిన వైద్యులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్నట్లు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి నోటిఫికేషన్‌లో పేర్కొంది. మొత్తం 100 పాయింట్లలో నియామకాలు చేపట్టనుండగా, ఎంబిబిఎస్‌లో పొందిన మార్కుల ఆధారంగా 80 పాయింట్లను నిర్ధారిస్తారు. అభ్యర్థులు ఎంబిబిఎస్‌లో అన్ని సంవత్సరాల్లో పొందిన మొత్తం మార్కులను కలిపి 82 శాతానికి మార్చుతారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహించిన వైద్యులకు 20 పాయింట్లు కేటాయిస్తారు.

6 నెలల సర్వీసు ఉంటేనే వెయిటేజీ

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో విధులు నిర్వహించిన వైద్యులకు వారు సేవలు అందించిన ప్రతి ఆరునెలల అనుభవానికి వెయిటేజీ పాయింట్లను కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున పాయింట్లు ఇస్తారు. వైద్యులు కనీసం 6 నెలల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటేనే వెయిటేజీ వర్తిస్తుంది. ఏ సేవ అందిస్తే.. అదే కేటగిరీ ఉద్యోగానికి మాత్రమే వెయిటేజీ పాయింట్లు వర్తిస్తాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలు అందించిన వైద్యులు వారు పనిచేసిన కాలానికి సంబంధిత విభాగాల నుంచి అనుభవ ధృవీకరణ పత్రం పొంది, దరఖాస్తుతో పాటు అనుభవ ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News