Thursday, November 14, 2024

ఆరోగ్య శాఖలో 2050 ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 2050 (స్టాఫ్ నర్స్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు బుధవారం సాయంత్రం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ డైరెక్టర్ సంక్షేమం, మెడికల్ డైరెక్టర్ విద్యలో 1576 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 332 పోస్టులు, ఆయుష్‌లో 61, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ 01, ఎంఎన్‌జె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ కేంద్రంలో 80 పోస్టులతో మొత్తం 2050 పోస్టులను భర్తీ చేసేందుకు ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పై ఖాళీల సంఖ్యలో మార్పులు చేర్పులు ఉండవచ్చని, ఖాళీలు పెరిగితే వాటిని జోడించడం, తగ్గించడం చేయవచ్చని సైతం ప్రకటనలో తెలిపారు. కాగా ఈ 2050 స్టాఫ్ నర్సుల పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఈ నెల 28 నుండి ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడానికి అక్టోబర్ 14 సాయంత్రం 5 గం. ల వరకు సమయం ఇచ్చారు. దరఖాస్తు దారులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అక్టోబర్ 16 ఉదయం 10.30 గం.ల నుండి సాయంత్రం 5గం.ల వరకు సమయం ఇచ్చారు. పరీక్ష నవంబర్ 17 న నిర్వహిస్తారు. ఈ పరీక్ష విధానం (సిబిటి) కంప్యూటర్(ఆన్ లైన్)లో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News