Monday, January 20, 2025

డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో కొలువుల జాతర మళ్లీ మొదలైంది. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి సోమవారం పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 868 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 153 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 257 పోస్టులు, బిసి గురుకుల డిగ్రీ కళాశాలల్లో 383 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. సోమవారం(ఏప్రిల్ 17) నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, మే 17 వరకు దరఖాస్తులకు చివరి తేదీ. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు.

ఉద్యోగాలకు 18 ఏళ్ల నుంచి -44 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు అర్హులు. వివిధ కేటగిరీలవారీగా అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. డిగ్రీ కళాశాలల్లో మొత్తం 868 పోస్టులకు గాను వేతనం రూ. 54,220 నుంచి రూ. 133,630లుగా ఉంటుందని గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే జూనియర్ కళాలల్లో 2008 పోస్టులకు (జూనియరల్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్) పోస్టులకు పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు వేతనం రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News