Wednesday, January 22, 2025

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ఉద్యోగ నియామకాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా మరో రెండు శాఖల్లో 276 పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖలో 148 వ్యవసాయ అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 100 మల్టీజోన్ 1 పోస్టులు, మల్టీ జోన్ 2లో 48 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. జనవరి 10 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ పేర్కొంది.

విద్యాశాఖలో 128 పోస్టులు

విద్యాశాఖలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. సాంకేతిక విద్యాశాఖలో 37, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే సంవత్సరం జనవరి 6 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. 18 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొంది. పూర్తి వివరాలకు http://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News