మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే డివిజన్‌లో పలు ఉద్యోగాలను కాంట్రాక్ట్ కింద భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దరఖాస్తులకు ఈనెల 29వ తేదీ వరకు పంపించాలని అధికారులు ప్రకటించారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు 04.06.2021, 05.06.2021న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ ఇంటర్వూ చేపట్టనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ మెయిల్ (contractmedicalhyb @gmail.com)కు పంపించాలని అధికారులు పేర్కొన్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు
స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు (3), ఎంబిబిఎస్ డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో పిజి పూర్తిచేసి ఉండాలి. 22.05.2021 నాటికి 53 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి రూ.95 వేల జీతం చెల్లించనున్నారు. జిడిఎం (కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్, 16 పోస్టులు) ఎంబిబిఎస్ డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 22.05.2021 నాటికి 53 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి రూ.75వేల వేతనాన్ని చెల్లించనున్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ (స్టాప్‌నర్స్ 31 పోస్టులు) జనరల్ నర్సింగ్‌లో మూడేళ్ల కోర్సు చేసి ఉండాలి. బిఎస్సీ (నర్సింగ్) పూర్తి చేయాలి. అభ్యర్థుల వయస్సు 22.05.2021 నాటికి 33 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి రూ.44,900 వేల వేతనాన్ని చెల్లించనున్నారు.
ఆస్పత్రి అటెండెంట్ (26 పోస్టులు) పదో తరగతి, ఐటిఐ పూర్తి చేయాలి. అభ్యర్థుల వయస్సు 22.05.2021 నాటికి 22 నుంచి 33 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి రూ.18 వేల వేతనాన్ని చెల్లించనున్నారు.
ఫార్మాసిస్ట్ (02 పోస్టులు) సైన్స్ విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు ఫార్మసీ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి. బి ఫార్మాలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 22.05.2021 నాటికి 20 నుంచి 33ఏళ్లు మించకూడదు.
Notification to 80 posts in South Central Railway division