Sunday, September 8, 2024

నోటిఫికేషన్ ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

 village courts

 

‘గ్రామ న్యాయాలయాల’పై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉన్న రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా ఆపని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని సుప్రీంకోర్టు హైకోర్టులకు విజ్ఞప్తి చేసింది. పౌరులకు ఇంటి ముంగిట న్యాయం అందేందుకు అట్టడుగు స్థాయిలో ‘గ్రామ న్యాయాలయాలు’ ఏర్పాటు కావాలని పేర్కొంటూ 2009లో పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించింది. సామాజిక, ఆర్థిక లేదా ఇతర లోటుపాట్ల కారణంగా న్యాయం పొందే అవకాశాలకు ఏ ఒక్కరూ దూరం కాకుండా చూడాలని ఆ చట్టం పేర్కొంది. ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుకు చాలా రాష్ట్రాలు నోటిఫికేషన్లు జారీ చేశాయని, కానీ కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో తప్ప మిగతా రాష్ట్రాల్లో అవి పనిచేయడంలేదని కూడా జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం గమనించింది.

గత ఏడాది అక్టోబర్ 18న అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ గుజరాత్, హర్యానా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఈ అంశంపై అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉందని ధర్మాసనం గుర్తించింది. ‘ఈరోజు నుంచి వారం లోగా పైన పేర్కొన్న రాష్ట్రాలు, లక్ష రూపాయలు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు (జ్యుడీషియల్) చెల్లించి తమ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తున్నాం. ఆయన ఆ మొత్తాన్ని ప్రత్యేక పద్దు కింద ఉంచాలి’ అని జస్టిస్ ఎన్.వి. రమణ సారథ్యంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం జనవరి 29 నాటి ఆదేశంలో పేర్కొంది.

Notifications given for setting up of village courts
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News