నిందితుడిపై 135 కేసులు
120 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన డిసిపి సాయిచైతన్య
హైదరాబాద్: పేరుమోసిన చైన్‌స్నాచర్, రిసీవర్‌ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 120 గ్రాముల బంగారు ఆభరణాలు, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని బండ్లగూడకు చెందిన ఎండి ఫైసల్ షా అలీ అలియాస్ అబ్దుల్లా జులాయిగా తిరుగుతున్నాడు. మహ్మద్ ఖలీల్ మగ్గ వర్క్ చేస్తున్నాడు, రిసీవర్‌గా పనిచేస్తున్నాడు. ఫైసల్‌పై మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 135 కేసులు నమోదయ్యాయి. షాలిబండ, నారాయణగూడ, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నెల 21వ తేదీన 2.30 గంటలకు ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న సుజాత నడుచుకుంటూ వెళ్తుండగా చైన్‌స్నాచింగ్ చేశాడు. ఇంటర్ వరకు చదువుకున్న ఫైసల్ షాధ ఆసిఫ్‌నగర్‌లో చదువుకున్నాడు. ఇంటర్ తర్వాత పంజాగుట్ట ఐసిఐసిఐ బ్యాంక్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డాడు.
నగరంలో 2006 నుంచి చైన్‌స్నాచింగ్ చేస్తున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రెండు సార్లు పిడి యాక్ట్ పెట్టారు. లంగర్‌హౌస్, సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత చైన్‌స్నాచింగ్ చేస్తూ స్నేహితుడు ఖలీల్ వద్ద షెల్టర్ తీసుకుంటున్నాడు. నిందితుడు చోరీ చేసిన సొత్తును ఖలీల్ విక్రయిస్తున్నాడు. ఇద్దరు కలిసి బైక్‌ను కొనుగోలు చేసి షాలిబండ, నారాయణగూడ, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్‌స్నాచింగ్ చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు నరేందర్, శ్రీశైలం, నర్సింహులు, సీనయ్య తదితరులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం షాలిబండ పోలీసులకు అప్పగించారు.