Sunday, January 19, 2025

ఉక్రెయిన్‌లో పలు గ్రామాల్లో వరదలు, నివాసితుల తరలింపు

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఖెర్సన్ ప్రాంతంలోని నోవా కఖోవ్కా ఆనకట్ట తెగిపోవడంతో దాదాపు 300 ఇళ్ల నుంచి నివాసితులను ఖాళీ చేయించినట్లు నోవా కఖోవ్కా పట్టణంలో ఉన్న రష్యా అధికారి మేయర్ వ్లాదిమిర్ లియోన్టీవ్ తెలిపారు. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ‘టాస్’ తెలిపింది. భద్రతా కారణాలరీత్యా పట్టణంలోని కొంత భాగానికి విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు కూడా ఆయన తెలిపారు. ఖేర్సన్ ప్రాంతంలోని కుడి ఒడ్డున దాదాపు 16000 మంది ప్రజలు సంక్లిష్ట జోన్‌లో ఉన్నారని ఓ సైనిక అధికారి తెలిపారు. ఖెర్సన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి ఒలెక్సాండర్ ప్రోకుడిన్ ప్రకారం డ్నిప్రో నది వెంబడి ఎనిమిది ప్రాంతాల్లో వరదలు వచ్చాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News