Sunday, January 19, 2025

కెనడాలో అంగరంగ వైభవంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: హాలిఫాక్స్, డార్ట్ మౌత్ వాసులు మన భారత సంస్కృతి, భారత సంప్రదాయాలను కెనడాలోని నోవా స్కోషియా హాలిఫాక్స్ నగరంలో సగర్వంగా వైభవంగా ప్రదర్శించారు. ఈ వేడుకలను విశాల్ భరద్వాజ్, వారి బృందం, సిఇఒ జోసెఫ్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 27,000 మందికి పైగా ముఖ్యంగా కెనడా దేశస్తులు, స్థానిక భారతీయులు హాజరయ్యారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించారు, దీనిలో భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతం, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రదర్శించే ఫ్యాషన్ షోలను ప్రదర్శించారు. అదనంగా ఈ కార్యక్రమంలో భారతీయ దుస్తుల స్టాల్, భారతీయ ఆహార స్టాల్ ను ఏర్పాటు చేసి మన సంస్కృతిని ప్రోత్సహించారు.

ఏ దేశ మేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపర నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ, 4-7 ఏళ్ల పిల్లలు భారతీయ నృత్యం, శాస్త్రీయ సంగీతాన్ని ప్రదర్శించారు. ఇది భారతీయులకి, చుట్టూ పక్కల ప్రాంతాల వారికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. శిబి నేతని చిరంజీవి అనే ప్రవాస భారతీయుడు కర్రసాము ప్రదర్శన ఇవ్వడంతో పాటు హర్ష లైట్ మ్యూజిక్ పాడారు. కుమారి జనని భారతనాట్యం, సంగీతతో కలిసి ఒడిసి నృత్యం, ఆరాధ్య కుచిపూడి  ప్రదర్శించారు. హాలిఫాక్స్ లోని అందరు భారతీయులకి ఇది ఒక కనులవిందు, ఇతర సంస్కృతుల ప్రజలు కూడా ఈ ప్రదర్శనలను ఎంతో ఆనందించారు.

వివిధ వంటకాల షడ్రుచులతో ఆనందంగా, ఆహ్లాదంగా జరిగిన తీరు అందరిని ఆకట్టుకున్నది. వేడుకలను ఘనంగా నిర్వహించిన, పెద్దలు, వాలంటీర్లు, ముఖ్యంగా కార్యక్రమానికి విచ్చేసిన అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు అద్భుతంగా ప్రేక్షకులు ప్రశంసించారు.

మన దేశం, రాష్ట్రం తరఫున కార్యకలాపాలను చల్లా శ్రీహరి రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించడంలో శ్రీహరి బృందం, సురేష్ ప్రియాంక, శ్రీలేఖ,  చంద్ర శ్రీలేఖ, మిలింద్, శ్రీకాంత్, చిరంజీవి రోహిత్, చిరంజీవి సోను, ప్రదీప్ సౌజన్య, మిస్ ఆస్తా, కృష్ణవేణి, రత్నం, శ్యామల, మిస్ సాత్వికీ, మిస్ కావ్యలు ప్రముఖ పాత్ర పోషించారు. కెనడాలోని నోవా స్కోషియా వేడుకలు అంగరంగ వైభవంగా జరగడంతో పాటు ఘనంగా ముగిశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News