Sunday, January 12, 2025

ఫైనల్లో జకోవిచ్

- Advertisement -
- Advertisement -

లండన్: డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో రెండో సీడ్ జకోవిచ్ 63, 64, 76 తేడాతో ఇటలీకి చెందిన 8వ సీడ్ జన్నిక్ సిన్నర్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే జకోవిచ్ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. తన మార్క్ ఆటతో సిన్నర్‌ను హడలెత్తించాడు. తొలి సెట్‌లో జకోవిచ్ ధాటికి సిన్నర్ ఎదురు నిలువలేక పోయాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించిన జకోవిచ్ అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు.

రెండో సెట్‌లో కూడా నొవాక్ దూకుడును ప్రదర్శించాడు.అయితే ఈసారి సిన్నర్ కాస్త మెరుగైన ఆటతో అలరించాడు. కానీ చివరి వరకు ఆధిపత్యాన్ని కాపాడుకున్న జకోవిచ్ సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్‌లో మాత్రం ప్రత్యర్థి సిన్నర్ నుంచి జకోవిచ్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈసారి సిన్నర్ సర్వం ఒడ్డి పోరాడాడు. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకోవడంలో సఫలమైన జకోవిచ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్ పోరుకు చేరుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News