Saturday, November 23, 2024

జకోవిచ్ ఖాతాలో 10వ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్..

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్ కింగ్ జకోవిచ్
ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నొవాక్ జకోవిచ్
జకో ఖాతాలో 10వ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్
ఫైనల్లో సిట్సిపాస్‌పై 63, 76, 76 తేడాతో రికార్డు విజయం
22 గ్రాండ్‌స్లామ్‌లతో నాదల్ సరసన సెర్బియా స్టార్
ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ తిరిగి జకోవిచ్ కైవసం
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ విజేతగా జకోవిచ్ అవతరించాడు. ఆదివారం జరిగిన టైటిల్‌పోరులో గ్రీక్‌స్టార్ టిట్సిపాస్‌పై జకోవిచ్ 6-3, 7-6(4), 7-6(5)తో రికార్డుస్థాయి విజయాన్ని సాధించాడు. తుదిపోరులో తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న జకో అనంతరం రెండుసెట్లలో సిట్సిపాస్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. రెండు, మూడు సెట్లు టై బ్రేకర్‌కు వెళ్లగా జకోవిచ్ పోరాడి విజయం సాధించాడు. మెల్‌బోర్న్ పార్క్‌లో ఆదివారం 10వ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను జకోవిచ్ తన వేసుకున్నాడు. సెర్బియా స్టార్ జకోవిచ్‌కి ఇది 22వ గ్రాండ్‌స్లామ్.

ఈక్రమంలో ప్రపంచంలో అత్యధికంగా 22గ్రాండ్‌స్లామ్‌ల విజేతగా అగ్రస్థానంలో ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సరసన నిలిచాడు. జకోవిచ్, నాదల్ చెరో 22గ్రాండ్‌స్లామ్‌లో సమంగా ఉన్నారు. కాగా గ్రీక్ ట్రైల్‌బ్లేజర్ స్టెఫానాస్ టిట్సిపాస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కల నెరవేరలేదు. రాడ్‌లేవర్ ఎరీనాలో టిట్సిపాస్‌ను చిత్తు చేసిన జకోవిచ్ తిరిగి ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా జరిగిన పోరులో పైచేయి సాధించిన జకోవిచ్ తొలి సెట్‌ను 6-3తో కైవసం చేసుకున్నాడు. రెండోసెట్‌లో ప్రతిఘటించిన టిట్సిపాస్ 2-1తో ఆధిక్యాన్ని సాధించాడు.

అయితే బలమైన ఏస్‌తో జకోవిచ్ 2-2తో సమం చేశాడు. టిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంలో జకో విఫలం అవడంతో గ్రీక్‌స్టార్‌కు 32తో మళ్లీ ఆధిక్యంలోకి దూసుకువెళ్లాడు. ఈక్రమంలో బ్యాక్ టు బ్యాక్ ఏస్‌లతో విరుచుకుపడిన సెకండ్‌సెట్‌లో 65 ఆధిక్యంలోకి దూసుకువెళ్లాడు. అయితే జకో పుంజుకోవడంతో రెండో సెట్ 6-6తో టైబ్రేకర్‌కు దారితీసింది. కానీ సెకండ్ సెట్‌ను టై బ్రేకర్‌కు తీసుకువెళ్లిన టిట్సిపాస్ సెట్‌ను సొంతం చేసుకోవడంలో విఫలమయ్యాడు. జకోవిచ్ రెండోసెట్‌ను 76 (4)తో కైవసం చేసుకున్నాడు. 10వ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌కు జకోవిచ్ ఒక్క సెట్ దూరంలో నిలిచాడు. ఓటమిని సులువుగా అంగీకరించని టిట్సిపాస్ మూడో సెట్‌లోనూ తీవ్రంగా ప్రతిఘటించాడు.

దీంతో మూడో సెట్‌కూడా టై బ్రేకర్‌కు దారితీసింది. మూడో సెట్‌ను 7-6 (5)తో గెలుచుకున్న జకోవిచ్ 10వ సారి టైటిల్ విన్నర్‌గా నిలిచి తన ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు చెందిన రింకీ హిజికాటా, జాసన్ కుబ్లర్ కైవసం చేసుకున్నారు. మహిళల డబుల్స్ విజేతలుగా చెక్ రిపబ్లిక్‌కు చెందిన టాప్‌సీడ్స్ బార్బోరాక్రెజ్‌సికోవా, కాటెరినా సినియాకోవా నిలిచి టైటిల్‌ను నిలబెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News