Friday, November 22, 2024

వింబుల్డన్ విజేత నోవాక్ జకోవిచ్

- Advertisement -
- Advertisement -

Novak DJokovic Wins 20th Grand Slam

వింబుల్డన్ విజేత జకోవిచ్
సింగిల్స్ ఫైనల్లో బెరెటిని ఓడించి 20వ గ్రాండ్‌స్లామ్
టైటిల్‌ను దక్కించుకున్న సెర్బియా యోధుడు

లండన్: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను టాప్‌సీడ్ సెర్బియా వీరుడు నొవాక్ జకోవిచ్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్ అయిన జకోవిచ్ ఏడో సీడ్ అయిన కెనడాకు చెందిన మ్యాట్టియో బెరెట్టినిని 6 7,6 4,6 4,6 3 స్కోరుతో నాటుగు సెట్ల పోరులో ఓడించి ఆరోసారి వింబుల్డన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. తొలి సెట్‌ను టై బ్రేకర్‌తో బెరెట్టిని దక్కించుకోవడంతో ఈ పోరు హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించారు. ఆ సెట్ గంటా పది నిమిషాల పాటు సాగింది. అయితే ఆ తర్వాత చెలరేగి పోయిన జకోవిచ్ మిగతా మూడు సెట్లను సునాయాసంగా దక్కించుకున్నాడు. కాగా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకోవాలన్న బెరెటినికి నిరాశ మిగిలింది. ఈ విజయంతో జకోవిచ్ 20 గ్రాండ్‌శ్లామ్ విజయాలతో రోజర్ ఫెడరర్, రఫెల్ నాడల్ సరసన నిలిచాడు. అంతేకాకుండా ఒకే ఏడాదిలో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను దక్కించుకున్న అయిదో ఆటగాడిగా నిలిచాడు.

ఇంతకు ముందు రాడ్ లేవర్, జాన్‌బోర్గ్, రాఫెల్ నాడల్, రోజర్ ఫెడరర్‌లు ఈ సాధించారు. అంతేకాకుండా రాడ్ లేవర్ తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్‌ను దక్కించుకున్న రెండో క్రీడాకారుడిగా కూడా రికార్డు సృష్టించాడు. అలాగే నాడల్ తర్వాతొకే క్యాలెండర్ ఇయర్‌లో మూడు వేర్వేరు మైదానాల్లో (హార్డ్, క్లే, గ్రాస్ కోర్టుల్లో) టైటిల్స్‌ను దక్కించుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. 2010లో నాడల్ ఋ ఫీట్ సాధించాడు. అన్నిటికి మించి వింబుల్డన్‌లో 75కి పైగా మ్యాచ్‌లు గెలుచుకున్న తొలి క్రీడాకారుడిగా సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కి చైర్ అంపైర్‌గా వ్యవహరించడం ద్వారా మారిజా పికాక్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌కి చైర్ అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.

Novak DJokovic Wins 20th Grand Slam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News