Monday, December 23, 2024

జకోవిచ్‌కు టైటిల్

- Advertisement -
- Advertisement -

Novak Djokovic wins Italian Open tennis tournament

 

రోమ్: ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహకంగా ఈ టోర్నీని నిర్వహించారు. ఫైనల్లో నాలుగో సీడ్ స్టెఫానొస్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు. దూకుడైన ఆటను కనబరిచిన జకోవిచ్ 60, 76తో సిట్సిపాస్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్‌లో జకోవిచ్‌కు ఎదురే లేకుండా పోయింది. ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండానే సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ రెండో సెట్‌లో సిట్సిపాస్ అసాధారణ పోరాట పటిమను కనబరిచాడు. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన జకోవిచ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను దక్కించుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News