Sunday, December 22, 2024

నోవాక్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

ఫైనల్లో అల్కరాజ్‌పై అలవోకగా గెలుపు
పారిస్ : ఎన్నో ఏండ్లుగా ఊరిస్తున్న ఒ లింపిక్స్‌లో పతక కలను కొల్లగొట్టాడు. మాజీ వరల్డ్ నంబర్ 1 నోవాక్ జకొవిచ్ తన కల సాకారం చేసుకున్నా డు. విశ్వ క్రీడల్లో ఏకంగా స్వర్ణం పతకాన్ని కైవసం చేసుకున్నాడు ఈ గ్రాండ్‌స్లామ్‌ల వీరుడు. టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించి అందనం త ఎత్తులో ఉన్న నోవాక్‌కు ఒలింపిక్ మెడల్ అందని ద్రాక్షగా మారింది.

కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్‌లతో చరి త్ర సృష్టించిన జొకో ఈసారి అద్భుత ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఆదివా రం హోరాహోరీగా పోరులో కార్లోస్ అ ల్కరాజ్(స్పెయిన్)పై జకో ఘన విజయం నమోదు చేశాడు. ఆడిన రెండు సెట్లలో నూ ఆధిపత్యం చెలాయించిన సెర్బియా స్టార్ 7-6, 7-6తో మ్యాచ్‌ను తనవైపు తిప్పుకొని విజేతగా అవతరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News