Friday, November 22, 2024

ఇక సచివాలయం వంతు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి, ప్రభుత్వానికి గుండెకాయ వంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ప్రక్షాళన చేసేందుకు భారీ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వాన్ని నడిపే ఫైళ్ళ సర్కులేషన్‌లో, జీవోల జారీలో అత్యంత కీలకమైన పాత్రను పోషించే అసిస్టెంట్‌సెక్రటరీ(ఎఎస్), డిప్యూటీ సెక్రటరీ (డిఎస్), జాయింట్ సె క్రటరీ (జెఎస్), అడిషినల్ సెక్రటరీ (ఎడిఎస్)ల హోదాల్లో అనేక సంవత్సరాలుగా ఒకే చోట విధు లు నిర్వర్తిస్తున్న సుమారు 45 మంది అధికారులను బదిలీలు చేసేందుకు ప్రభుత్వం భారీగా కసరత్తులు చేస్తోంది. అంతేగాక ప్రభుత్వ పాలన లో ఈ నాలుగు హోదాల్లోని అధికారులదే అత్యంత కీలకమైన పాత్ర ఉంటుంది గనుక వారివారి విద్యార్హతలు, వ్యక్తిగత విషయాలు, వ్యవహారశైలి, గత ప్రభుత్వ హయాంలో వారు నిర్వహించిన బాద్యతలు, ఆరోపణలు, విమర్శలు వంటి ఏమైనా ఉన్నాయా..? అనే అంశాలపై సమగ్రం గా దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగానికి ఒక జాబితాను కూడా ఇచ్చినట్లు తెలిసింది.

సెక్రెటేరియేట్ అధికారులు కావడంతో ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డినే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు, చీఫ్ సెక్రటరీలు ప్రత్యేకంగా కోరినట్లు తెలిసింది. రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సె క్రటరీ హోదాలో 77 మంది, డిపూట్యీ సెక్రటరీ కేడర్‌లో 24 మంది, జాయింట్ సెక్రటరీ హోదా లో16 మంది, అడిషినల్ సెక్రటరీ హోదాలో 11 మంది అధికారులు కలిపి మొత్తం 128 మంది అధికారులున్నారని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ఈ అధికారుల ప్రమేయం లేకుండా ఒక్క ఫైల్   అందుకే ఫైళ్ళల్లో కాన్ఫిడెన్షియాలిటీ (సీక్రేట్‌గా ఉంచడం)ని పాటించాలంటే త ప్పనిసరిగా మొత్తం సచివాలయాన్నే ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని భావించిన మీదటనే చీఫ్ సెక్రటరీ, సిఎంఓ అధికారులు బదిలీలు చేసేందుకు కసరత్తులు చే స్తున్నారని వివరించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కీలకమైన, అత్యంత ప్రధానమైన పోస్టుల్లో ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అధికారులు, గత సర్కార్‌కు కళ్ళు, చెవులుగా పనిచేసిన అధికారులను తప్పకుండా బదిలీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అందుకే మొదటి విడతగా ఈ నాలుగు హోదాల్లోని 45 మంది అధికారులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇప్పటికే రెవెన్యూశాఖలో అడిషినల్ సెక్రటరీగా పదేళ్ళుగా విధు లు నిర్వర్తించిన, సెక్రటేరియేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.నరేందర్‌రావును బదిలీ చేశారని, మిగతా జాబితా కూడా త్వరలోనే వెలువడుతుందని వివరించారు.

ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవెన్యూశాఖ, ఆర్థికశాఖ, మున్సిపల్ పరిపాలనా వ్యవహారాలు, హోంశాఖ, పరిశ్రమలు, వ్యవసాయం, నీటిపారుదలశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాధారణ పరిపాలనా శాఖల్లోని సీనియర్ అధికారులకు స్థాన చలనం తప్పదని అంటున్నారు. అంతేగాక గత ప్రభుత్వంలో లూప్‌లైన్‌లో ఉన్న అధికారుల గుణగణాలు, విద్యార్హతలు, వారి స్పెషలైజేషన్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారని తెలిపారు. మంచి వ్యక్తిత్వం, టాలెంట్ ఉండి, సర్వీస్ మ్యాటర్‌లలో అవగాహన ఉండి కూడా లూప్‌లైన్‌లో ఉ న్న అధికారుల కోసం ప్రత్యేకమైన అన్వేషణ జరుగుతోందని వివరించారు. ముఖ్యంగా రెవెన్యూశాఖలో భూముల వ్యవహారాలు, ధరణి పోర్టల్‌పై అవగాహన, ఇతర రెవెన్యూ వ్యవహారాలను చక్కదిద్దాలంటే తప్పకుండా విద్యార్హతలు, టాలెంట్, వ్యక్తిగత సామర్ధం వంటివి ఉండాలని, అలాంటి అధికారి కోసం వెతుకుతున్నారని వివరించారు.

అంతేగాక రెవెన్యూశాఖలో కూడా కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ విభాగం, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగాల వ్యవహారలపై సమగ్రమైన అవగాహన ఉన్న అధికారి కావాల్సి ఉంటుందని, ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు వ చ్చే ఆదాయాన్ని, దానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షణ చేయాల్సిన టాలెంటెడ్ వ్యక్తులు కావాలని, అందుకే కొద్దిగా ఆలస్యమైనప్పటికీ అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసిన తర్వాతనే బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తారని వివరించా రు. అంతేగాక ఆర్థికశాఖలో పనిచేసే అధికారులు బడ్జెట్‌లపైన, ఆర్ధిక వ్యవహారాలపైన, కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన అవగాహన ఉండాల్సి ఉంటుందని, అంతేగాక రాష్ట్ర ప్రభుత్వంలో వర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు, టీచర్లు పో స్టులను భర్తీ చేసేందుకు తగిన విధంగా కసరత్తులు చేసే అధికారులు కావాల్సి ఉందన్నారు. నీటిపారుదల శాఖలోనైతే ఇంజనీర్ల సర్వీసు వ్యవహారాలే కాకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు, సాంకేతికపరమైన అంశాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తో కూడా సంబంధాలు సాగించాల్సిన టాలెంట్ ఉండాల్సి ఉంటుందని, అందుకోసం విద్యార్హతలతోపాటుగా వ్యక్తిగత వ్యవహారశైలిని కూడా చూస్తున్నారని వివరించారు.

మొత్తంమీద వచ్చే వారంలో సెక్రటేరియేట్‌లోని ఈ నాలుగు హోదాల్లో పనిచేస్తున్న అధికారుల బదిలీల పక్రియ ఉంటుందని వివరించారు. ఈ 45 మం ది అధికారులు కనీసం అయిదేళ్ళ నుంచి గరిష్టంగా పది, 11 ఏళ్ళ నుంచి ఒకే పోస్టులో కొనసాగుతూ వచ్చిన వారున్నారని, అలాంటి పాతుకుపోయిన అధికారులపైన ప్రస్తుతం దృష్టిసారించారన్నారు. ఇక ఆ తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఎస్‌ఓ), సెక్షన్ ఆఫీసర్ (ఎస్‌ఓ)ల హోదాల్లో పనిచేస్తున్న అధికారులను కూడా బదిలీలు చేస్తారన్నారు. ఒకేచోట ఎక్కువ సంవత్సరాలు విధులు నిర్వర్తిస్తుంటే కూడా అనేక ఆరోపణలు వస్తాయని, బదిలీలు చేయడమే మేలని కొందరు సీనియర్ అధికారులు కూడా ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News