Monday, January 20, 2025

ఇక పాలమూరు పరుగులు

- Advertisement -
- Advertisement -

లక్కా భాస్కర్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ :నీటిపారుదల రంగంలో ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా నికర జ లాలే ఆయువు పట్టుగా ఉంటాయి. నదీజలా ల లభ్యత నీటిలో 75శాతం డిపెండబులి టీ ఉన్నపుడే అటు వంటి ప్రాజెక్టుల నిర్మాణాల కు అవసరమైన అన్నిరకాల అనుమతులు కేం ద్ర జలసంఘం నుంచి చకచకా లభిస్తా యి. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఈ కోవలోనే చేరిపోయింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు పొందటంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించగలిగా రు. పాలమూరు ప్రాజెక్టుకు నమ్మకమైన ని కర జలాలను చూపుతూ అందకు సంబంధించిన వివరణతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. కేంద్రజల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షె కావత్ ద్వారా ఈ ప్రాజెక్టుకు కేం ద్ర ప్రభు త్వం నుంచి ఆర్థిక సాయం హామీని పొందటంలో సక్సెస్ అయ్యారు. కృష్ణానదీజలాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జ స్టిస్ బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదే శ్ రాష్ట్రానికి కృష్ణానదీజలాల పంపిణీలో 811టిఎంసీల నీటిని కేటాయించింది. ఈ నీ టిలో ఆంధ్రప్రాంతానికి 66శాతం , తెలంగాణ ప్రాంతానికి 34శాతం కింద రెండు ప్రాం తా లు నీటిని వినియోగించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి 2014లో తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం 299టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల రంగంలో ప్రత్యేక దృష్టి సారించి మిషన్ కాకతీయ వంటి పథకాలు చేపట్టింది. చెరువులు కుంటలను పునరుద్దరించింది. ఏళ్లతరబడి పేరుకుపోయి న పూడికమట్టిని తొలగించింది.
రాష్ట్రంలో చిన్ననీటిపారుదల రంగాన్ని పటిష్టపరచటం ద్వారా ఈ రంగానికి కేటాయించిన నీటిలో 45టీఎంసీల నీటిని మిగల్చగలిగింది. మరోవైపు ఏపిలో అక్కడి ప్రభుత్వం గోదావరీ నదీజలాలను కృష్ణానదీలోకి మళ్లించటం ద్వారా నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతాలకు 45టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం హక్కుగా లభించింది.నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కృష్ణానదీ జలాల్లో ఆదనంగా వచే 45టీఎంసీలను తన ఖాతాలో వేసుకుంది. అటు చిన్ననీటి వనరుల ద్వారా మిగిల్చిన 45 టీఎంసీలు , గోదావరీ నదీజలాల మళ్లింపు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి లభించిన 45టీఎంసీలు నికర జలాల కిం ద హక్కుగా లభించాయి. దీంతో కృష్ణానదీజలాల్లో 75 శాతం డిపెండబులిటీ కింద నమ్మకంగా లభించే 90టీఎంసీలతోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటిపారుదల పథకం రూపుదిద్దుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ వెనుక జాలల్లో కోతిగుండు ప్రాంత వద్ద 800అడుగుల స్థాయిలో కృష్టానదీజలాలను ఎత్తిపోసి కరువుపీడిత దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు లక్ష్యాలు సాకారం కాబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఇదే అంశాలను వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ శాఖలనుంచి క్లియరెన్సులు లభించాయి.
కేంద్రం నుంచి రూ.33 వేలకోట్లు!
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకానికి కేంద్ర నుంచి ఆర్థిక సహాయం కింద రూ.33వేలకోట్లు తెలగాణకు లభించే అవకాశాలు ఉన్నట్టు నీటిపారదుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పధకానికి మొత్తం అంచనా వ్యయం రూ.55వేలకోట్లు కాగా , కేంద్రం ఇం దులో 60శాతం నిధులు సమకూర్చేందుకు హామీ ఇచ్చింది. 2014తర్వాత నీతిఆయోగ్ సూచనల మేరకు దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటంలేదు. అందుకే ఏపికి ప్రత్యేక హోదాకు బదులు అంతేరీతిలో లబ్ధికలిగేలా ప్రత్యేక ప్యాకేజిని కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. అంతే కాకుండా ఏ రాష్ట్రంలోనూ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వటం లేదు. పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తేల్చిచెప్పారు. అందుకు బదులుగా ప్రధానమంత్రి కృషి సంచాయక్ యోజన్ పధకం కింద 60;40 నిష్పత్తిలో నిధులు సమకూర్చుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హామీ ఇచ్చారు. ప్రాజెక్టు అయ్యే మొత్తం వ్యయంలో కేంద్రం నుంచి 60శాతం కింద రూ.33వేలకోట్లు రాష్ట్రానికి లభించే అవకాశాలు ఉన్నాయి.
పాలమూరు డిపిఆర్‌లో కదలిక
కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపిఆర్‌లో కదలిక వస్తోంది. కేంద్ర జలసఘం పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టు డిపిఆర్‌కు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన అభ్యర్థ్ధనకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల్లో అటవీ, పర్యవరణ శా ఖల అనుమతులు , వైల్డ్‌లైఫ్ అనుమతులు లభించారు. వీటితో పాటు అత్యంత కీలకమైన హైడ్రాలజీ అనుమతి రావాల్సివుంది. ఇరిగేషన్‌ప్లానింగ్, కాస్ట్ ఎస్టిమేట్స్, అంతర్‌రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన అనుమతులు కూడా త్వరగా ఇవ్వాలని చేసిన విజ్ణప్తికి కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News