Monday, December 23, 2024

మరో వివాదంలో నిర్మాత బండ్ల గణేష్..

- Advertisement -
- Advertisement -

ఇటీవల చెక్‌ బౌన్స్‌ కేసులో ఏడాదిపాటు జైలు శిక్షలో ఇరుక్కున్న టాలీవుడ్‌ నిర్మాత, కాంగ్రెస్‌ నాయకుడు బండ్ల గణేశ్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. అద్దెకు తీసుకున్న తన ఇంటిని కాజేసేందుకు బండ్ల గణేశ్‌ ప్రయత్నించడంతో తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నాడని ఆరోపించారు హీరా గ్రూప్‌ అధినేత నౌహీరా షేక్‌.

ఈ మేరకు నౌహీరా షేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఫిలింనగర్‌ సైట్‌-2లో ఉన్న సుమారు రూ.75కోట్ల విలువైన ఇంట్లోని మొదటి ఫ్లోర్‌ను బండ్ల గణేశ్‌కు 11నెలలు రెంటల్‌ అగ్రిమెంట్‌ తో 2021 జూన్‌ 5న అద్దెకు ఇచ్చామన్నారు. గడువు ముగిసిన తర్వాత కూడా తన ఇంటిని ఖాళీ చేయకపోగా, ఈడీ అధికారులు ఇంటిని అటాచ్‌ చేశారని తెలుసుకున్న బండ్ల గణేశ్‌.. తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 11 నెలలు చేసిన రెంటల్‌ అగ్రిమెంట్‌ను ఫోర్జరీ చేసి 9 ఏండ్లు అద్దెకు తీసుకున్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడని, తక్కువ ధరకు ఇంటిని అమ్మాలంటూ ఒత్తిడి తీసుకువస్తూ వేధిస్తున్నాడని ఆమె తెలిపింది. బండ్ల గణేశ్‌ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఫిలీంనగర్ పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేశానని.. తనకు న్యాయం చేయాలని కోరినట్లు నౌహీరా షేక్‌ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News