Saturday, December 21, 2024

బ్యాంకు ఖాతాకు ఎన్‌పిసిఐ నమోదు తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/సూర్యాపేట రూరల్ : రైతుల బ్యాంకు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకం పిఎం కిసాన్ తదుపరి వాయిదా నిధులు జమ కావాలంటే రైతుల బ్యాంక్ ఖాతాకి ఎన్‌పిసిఐ నమోదు తప్పనిసరి అని మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ జానిమియా తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని కేసారం రైతు వేదికలో నిర్వహించన రైతు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

రైతుల బ్యాంక్ ఖాతాకి ఆధార్ లింక్‌తో పాటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కొరకు ఎన్‌పిసిఐ నమోదు తప్పని సరి అని, ఎన్‌పిసిఐ నమోదు కాని పెండింగ్ రైతుల ఖాతా వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి సంబంధిత బ్యాంకు ద్వారా త్వరగా ఎన్‌పిసిఐ నమోదు చేసుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ముత్తయ్య, ఎస్‌బిఐ బ్యాంక్ సిఎస్పీ కస్టమర్ సర్వీస్ పాయింట్ బోయిళ్ల రాంబాబు, యాతం వెంకట్ రెడ్డి, బోల్లేపల్లి అంజయ్య, లింగారెడ్డి, సతీష్ రెడ్డి, రాధాకృష్ణ, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News