Thursday, January 23, 2025

లైన్‌మెన్‌ను అభినందించిన ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాలరావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చెరువులో తెగిపడిన 11 కేవి హైటెన్షన్ తీగలను ఈదుకుంటూ వెళ్ళి లైన్లను సరి చేసి విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చేసిన లైన్‌మెన్ రహమాన్‌ను ఎన్‌పిడిసిఎల్ సీఎండి అన్నమనేని గోపాలరావు అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇంత నియమ నిబ్బద్దతతో పని చేసి వినియోగదారుల ఆదరాభిమాను చూరగొనాలని కోరారు .ఎన్పీడీసీఎల్ కంపెనీ కి మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరిలో పట్టుదల ,ఆత్మ విశ్వసం ఉన్నపుడే అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు.
జనగామ సర్కిల్ ,జనగామ డివిజన్, దేవరుప్పుల సెక్షన్ లో జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నరహమాన్ గురువారం సంభవించిన గాలి దుమారం, భారీ వర్షానికి ధర్మాపురం ఊరచెరువు మధ్యలో 11 కేవీ హైటెన్షన్ వైర్లు పోల్ నుంచి వైర్ తెగి నీటిలో తెగిపడ్డాయి. విషయం తెలుసుకున్న జూనియర్ లైన్ మెన్ రహమాన్ శుక్రవారం సాయంత్రం ఊరచెరువు నిండి మత్తడి పోస్తుండగా విద్యుత్తు సర ఫరా పునరుద్ధరణ కష్టంగా మారిన తరుణంలో ఎలాగైనా విద్యుత్ సరఫరా పున రుద్దరించాలన్న లక్ష్యంతో చెరువులో చేపలు పట్టే తెప్పను తెచ్చి విద్యుత్తు రిపేరు పరికరాలతో సహా తెప్పపై ప్రయాణించి 11 కేవీ వైర్ ను పోల్ పై అమర్చాడు.దీంతో బీఆర్ తండా, వ్యవసాయ బావులకు, సెల్ టవరకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు .అత్యంత కష్టంతో కూడుకున్న పనిని , సాహోసోపేతంగా వ్యవహరించి విద్యుత్ సరఫరా అందించినందుకు బీఆర్ తండా వాసులతో పాటు సూపెరింటెండింగ్ ఇంజనీర్ వేణు మాధవ్‌లు అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News