Monday, December 23, 2024

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉద్యోగాల భర్తీకి సంబంధించి నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎటువంటి నోటికేషన్ ఇవ్వలేదని కంపెనీ చైర్మన్ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. ఎన్‌పిడిసిఎల్ జారీ చేసినట్టుగా వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని , ఇది పూర్తిగా తప్పుడు నోటిఫికేషన్ అని స్పష్టం చేశారు.

Also Read: ఆర్ టిసి బస్సు- ఆటో ఢీ: భార్యాభర్తల దుర్మరణం

ఎన్‌పిడిసిఎల్ నోటిఫికేషన్ జారీ చేస్తే అది కంపెనీ వెబ్‌సైట్లో పెడతామని ,ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని కెరియర్స్‌లో నోటిఫికేషన్ చూసి నివృతి చేసుకోవాలని చైర్మన్ తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని నమ్మవద్దని చైర్మన్ గోపాల్ రావు ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News