Monday, December 23, 2024

ఐపిఎస్ అధికారిణికి ఎన్‌ఆర్‌ఐ వేధింపులు

- Advertisement -
- Advertisement -

నిందితుడు అరెస్ట్..రిమాండ్

NRI harassment to IPS officer

మనతెలంగాణ/హైదరాబాద్: ఐపిఎస్ శిక్షణ పొందుతున్న అధికారిణినికి అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్న ఎన్‌ఆర్‌ఐని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అలస్యంగా వెలుగుచూసింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రాంతానికి చెందిన మల్‌రాజ్ సింగ్ కాలిఫోర్నియాలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అమెరికాలో అతనికి గ్రీన్‌కార్డ్ సైతం ఉంది. గత కొంతకాలంగా పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారికి అతడు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు. ఆమె ఫొటోలు సోషల్ మీడియా నుంచి తీసుకుని బ్లాక్ మెయిల్ సైతం చేశాడు.

ఈక్రమంలో సదరు ఐపిఎస్ అధికారిణి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి)కి శిక్షణ నిమిత్తం వచ్చింది. జూబ్లీహిల్స్‌లో ఓ అతిధి గృహంలో ఉంటూ ఆమె శిక్షణ తరగతులకు హాజరౌతోంది. ఈ విషయం తెలుసుకున్న మల్‌రాజ్ సింగ్ పంజాబ్ నుంచి నేరుగా ఐపిఎస్ అధికారిణి శిక్షణ తీసుకుంటున్న ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డికి వచ్చాడు. ఈనెల 1న ఎంసి హెచ్‌ఆర్‌డికి వెళ్లి వివరాలు తెలుసుకొని అధికారిణి ఉంటున్న అతిథిగృహం వద్దకు వెళ్లి వేధింపులకు పాల్పడ్డాడు.

దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ఐపిఎస్ అధికారిణి మల్‌రాజ్ సింగ్ వేధింపులపై ఎంసి హెచ్‌ఆర్‌డి ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపింది. ఎంసి హెచ్‌ఆర్‌డి అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడిపై ఐపిసి 509, 354డి, 452 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News