Sunday, December 22, 2024

పేదింటి యువతి పెళ్లికి పెద్ద దిక్కైన ఎన్నారై

- Advertisement -
- Advertisement -

వీర్నపల్లి ః పేదింటి యువతి పెళ్లికి పెద్ద దిక్కుగా నిలవడమే కాకుండా పెండ్లి పందిరిలోనే లక్ష రూపాయల సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు ఈటిసిఏ అధ్యక్షుడు రాధారపు సత్యం. వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఇటిక్యాల మంజూల కీ.శే. మల్లేశం దంపతుల కూతురు మాధవి వివాహం పర్శరాములతో గురువారం వీర్నపల్లిలో జరిగింది. వివాహనికి హజరైనా సత్యం నూతన వధువరులను ఆశీర్వదించారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలిసి చలించిపోయిన ఆయన పెండ్లి పందిరిలోనే ఒక లక్ష రూపాయల సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా సత్యంకు యువతి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు గుగులోతు కళా, నాయకులు మాడుపు తిరుపతి రెడ్డి, లోకూర్తి తిరుపతి, తిరుపతి నాయక్, నీలం రాజేశ్ బాబు, అన్నారం అజయ్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News